'సాగు పద్ధతులకు సాన పెట్టాలి' - hens
సంప్రదాయ పద్ధతులకు సెలవు చెప్పి, ఆధునిక పద్ధతులు పాటిస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని మహిళలకు ఎన్.జి రంగా విశ్వవిద్యాలయ పరిశోధకులు సూచించారు. పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకాల్లో తీసుకోవాాల్సిన మెలకువలపై అవగాహన కల్పించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా అనకాపల్లి ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై మహిళలకు అవగాహన కల్పించారు. అపరాల(కందుల)లో అధిక దిగుబడిని సాధించడానికి మేలైన యాజమాన్య పద్ధతులపై, వ్యవసాయంలో యాంత్రీకరణ అవసరాలను సమగ్రంగా వివరించారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే అవలంబించాల్సిన ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. పాతకాలంలో మాదిరి సాగుతో పాటు అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. అధిక దిగుబడినిచ్చే ఎల్‌ఆర్‌జీ 52 రకం కంది విత్తనాలని, కడక్‌నాథ్ కోళ్లను మహిళలకు పంపిణీ చేశారు.