విశాఖ జిల్లా చీడికాడలో స్థానిక తహసీల్దార్ అంబేడ్కర్ రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బందితో సమావేశమయ్యారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు పంటనష్టం గుర్తింపుపై వారికి శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టాన్ని పారదర్శకంగా.. పక్కగా చేపట్టాలని సూచించారు. 33 శాతం కంటే ఎక్కువ నష్టపోయిన పంటలను గుర్తించాలని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రైతుల నుంచి ఎటువంటి ఆరోపణలు, ఫిర్యాదులు రాకుండా విధులు నిర్వహించాలన్నారు.
'పంట నష్టాన్ని నిబంధనల ప్రకారం పారదర్శకంగా గుర్తించాలి'
వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు రెవెన్యూ, వ్యవసాయ సిబ్బందికి నష్టాన్ని అంచనా వేసే మార్గదర్శకాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. 33శాతం కంటే ఎక్కువ నష్టం కలిగిన పంటలను పరిగణలోకి తీసుకోనున్నారు.
పారదర్శకంగా గుర్తించాలి