ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'న్యాయ విద్యార్థులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి' - ప్రొఫెషనల్‌ స్కిల్స్‌ ఫర్‌ లా స్టూడెంట్స్‌

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా న్యాయ విద్యార్థులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సాఫ్ట్‌స్కిల్స్‌ శిక్షకుడు డాక్టర్‌ చల్లా క్రిష్ణవీర్‌ అభిషేక్‌ అన్నారు. ఏయూ న్యాయ కళాశాల విద్యార్థులతో.. ఈ అంశంపై ఆయన ప్రసంగించారు. ఆంగ్లంపై పట్టు పెంచుకోవాలని సూచించారు.

training classes to law students at au
training classes to law students at au

By

Published : Nov 16, 2021, 7:51 PM IST

న్యాయ విద్యార్థులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని భాషా పరిశోధకులు, సాఫ్ట్‌స్కిల్స్‌ శిక్షకుడు డాక్టర్‌ చల్లా క్రిష్ణవీర్‌ అభిషేక్‌ అన్నారు. ఏయూ న్యాయ కళాశాల విద్యార్థులతో 'ప్రొఫెషనల్‌ స్కిల్స్‌ ఫర్‌ లా స్టూడెంట్స్‌' అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అభిషేక్‌ మాట్లాడుతూ సమర్థవంతమైన రచనా సామర్ధ్యాలు, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలతో పాటు వృత్తి నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. మన వ్యక్తిత్వ అభివృద్ది, ఆంగ్ల భాష పరిజ్ఞానం వృత్తిలో అభివృద్దికి దోహదకారిగా నిలుస్తాయన్నారు.

న్యాయ కళాశాల ప్లేస్‌మెంట్‌ అధికారిణి ఆచార్య కె. సీతా మాణిక్యం మాట్లాడుతూ పరిశ్రమకు అవసరమైన సామర్థ్యాలు కలిగి ఉండటం విద్యార్థులకు ఎంతో ముఖ్యమని అన్నారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details