ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-పూరీ(02860) ప్రత్యేక రైలు ఈనెల ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం చేరుకొని అక్కడి నుంచి 8.02 గంటలకు బయలు దేరుతుంది. భువనేశ్వర్-పుదుచ్చేరి(02898) ప్రత్యేక రైలు ఈనెల 12 నుంచి 10.50గంటలకు విలుప్పురం చేరుకొని అక్కడి నుంచి 10.55 గంటలకు బయలుదేరి 11.50 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. భువనేశ్వర్-రామేశ్వరం(08496) ప్రత్యేక రైలు ఉదయం 10.50 గంటలకు విలుప్పురం చేరుకొని అక్కడి నుంచి 10.55గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.01 చిదంబరం చేరుకొనే రైలు 12.20 గంటలకు బయలుదేరి రాత్రి 10.30 గంటలకు రామేశ్వరం వెళుతుంది. ఈ నెల 14 నుంచి సంబల్‌పూర్-రాయగడ-సంబల్‌పూర్(08301-08302) ప్రత్యేక రైలుకు బీస్సమ్‌కటక్ స్టేషన్‌లో హాల్ట్ కల్పిస్తున్నారు.
స్టేషన్లకు చేరుకునే సమయాల్లో మార్పులు.. ఆ రైళ్లు ఇవే.. - వాల్తేర్ డివిజన్లో రైళ్ల సమయాల్లో మార్పులు న్యూస్
పలు ప్రత్యేక రైళ్లు స్టేషన్‌లకు చేరుకునే సమయాల్లో మార్పులు చేసినట్లు తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

train timings change in East Coast Railway division