విశాఖ ఏజెన్సీ పరిధిలోని పాడేరు వంజంగి కొండల్లో పర్యాటకులు బారులు తీరారు. వేకువజామున మేఘాల కొండ అందాలు చూసేందుకు అధిక సంఖ్యలో వాహనాలతో కొండ ప్రాంతం చేరుకున్నారు. ఎప్పుడూ లేనంతగా పర్యాటకులతో కొండలు నిండిపోయాయి.
వంజంగి కొండల్లో పర్యాటకుల సందడి - విశాఖ వార్తలు
విశాఖ జిల్లాలోని పాడేరు వంజంగి కొండలు పర్యాటకులతో కిటకిటలాడాయి. మేఘాల కొండ అందాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యటకులు తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ట్రాఫిక్ వల్ల నిరుత్సాహంగా వెనుతిరిగారు.
వంజంగి కొండల్లో పర్యటకుల సందడి
కొన్ని వాహనాలు మధ్యలో ఆగిపోయిన కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇరు వైపులా నిలిచిపోయాయి. వేకువజాము నుంచి బయలుదేరినప్పటికీ మార్గంలో చాలా వాహనాలు నిలిచిపోయాయి. మరోపక్క చలి ఉండి పొగమంచు లేని కారణంగా.. పర్యటకులు నిరాశకు గురయ్యారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నిరుత్సాహంగా వెనుతిరిగారు.