విశాఖ జిల్లాలోని సుప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బొర్రా గుహల వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. గత కొన్ని నెలలుగా గుహలు మూతపడి ఉండటం వల్ల పారిశుద్ధ్యం నిర్వహించి పర్యాటకుల కోసం సిద్దం చేశారు. వారాంతపు రోజుల్లో ఈ గుహలను చూసేందుకు సందర్శకులు ఎక్కువగా వస్తున్నారు. చలికాలం కావడం వల్ల అరకు, బొర్రా గుహలను చూసేందుకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
బొర్రా గుహల వద్ద పర్యటకుల సందడి - Visakha Borra Caves
అన్లాక్ సడలింపుల వల్ల పర్యాటక ప్రాంతాల్లో క్రమంగా సందడి పెరుగుతోంది. విశాఖ జిల్లాలో పర్యాటక ప్రదేశం బొర్రా గుహల వద్ద పర్యాటకుల తాకిడి పెరిగింది.

బొర్రా గుహల వద్ద పర్యటకుల సందడి