విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం ప్రాంతం సందర్శకులతో నిండిపోయింది. దసరా పండుగ కావడంతో రెండు రోజులుగా జలాశయానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. పిల్లలు..పెద్దలు జలాశయం వద్ద సందడి చేస్తున్నారు. వర్షాలకు జలాశయం నిండుకుండలా ఉంది. ప్రధాన గట్టు సందర్శకులతో నిండిపోయింది. దీంతో చూడటానికి వచ్చిన వారు జలాశయంతో పాటు పరిసర ప్రాంతాలను ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు.
రైవాడ జలాశయానికి పర్యాటకుల తాకిడి - విశాఖలో పర్యటక ప్రదేశాలు
విశాఖ జిల్లా రైవాడ జలాశయం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. దసరా పండగ కావడంతో రెండు రోజులుగా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. జలాశయం ప్రాంతం సందర్శకులతో కిటకిటలాడుతోంది.
రైవాడ జలాశయానికి పర్యాటకుల సందడి