విశాఖపట్నం - భీమిలి బీచ్ రోడ్డులో తీరానికి అతి సమీపంలోని ఖాళీగా ఉన్న తొమ్మిది ఎకరాల స్థలానికి పర్యటక శాఖ అధికారులు సర్వే చేస్తున్నారు. సర్వే శాఖ సిబ్బందితో ఈ భూమికి సంబంధించిన కచ్చితమైన కొలతలు, హద్దులు వేస్తున్నారు. మట్టి పరీక్షల కోసం ఆ ప్రాంతంలోని కొన్ని చోట్ల నుంచి మట్టి నమూనాలు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా ఒకటి రెండు రోజుల్లో బోరు వేయనున్నట్లు తెలిసింది.
రుషికొండ తీరానికి అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంతో పాటు దానికి ఆనుకొని కొండపైనున్న మరికొంత స్థలాన్ని పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్యం)కింద 2000 సంవత్సరంలో 33 ఏళ్లకు లీజుకు అప్పగించారు. ప్రస్తుతం కొండపై ఆరోగ్య సంబంధ చికిత్సా సేవా కేంద్రాన్ని నిర్వహిస్తుంగా బీచ్ రోడ్డు పక్కన కేటాయించిన స్థలాన్ని ఏవిధంగా ఉపయోగించడం లేదు. 20 ఏళ్లుగా దాన్ని నిరుపయోగంగానే ఉంచారు. ఇటీవల ఈ ప్రాజెక్టు చేతులు మారుతుందన్న ఆరోపణలు రావడం, కొద్ది రోజులుగా సర్వే పనులు చేయడంతో ఇది మళ్లీ తెరపైకి వచ్చింది.