ఇతర దేశాల పౌరులు భారత భూభాగంపై అడుగుపెట్టాలంటే ఎన్నో అనుమతులు ఉండాలి. ఊహించని విధంగా నౌక తీరానికి వచ్చేయడంతో అందులోని సిబ్బంది కొన్ని రోజులపాటు నౌకలోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరమ్మతు చేయడం సాధ్యం కాదని తేల్చిన తరువాత వారిని నగరంలోని ఒక హోటల్‌కు తరలించారు. వారు బయటకు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాదానికి దారితీసిన అంశాలపై మర్కంటైల్ మెరైన్ డిపార్ట్‌మెంట్ (ఎం.ఎం.డి.) అధికారుల దర్యాప్తు పూర్తి కావాలి. అది పూర్తైనట్లు నిరభ్యంతర పత్రం ఇచ్చిన అనంతరమే సిబ్బంది దేశం నుంచి వెళ్లడానికి వీలవుతుంది. బుధవారం నాటికి ఆ ప్రక్రియ కూడా పూర్తయింది. సిబ్బందికి రెండు నెలలపాటు జీతభత్యాలను, వారిని వారి దేశానికి పంపడానికి అయ్యే వ్యయాలను కూడా బీమా సంస్థలే భరించనున్నాయి.
అక్టోబరు 13
- నౌక ఒడ్డుకు కొట్టుకు రావడం: ఈ ఘటన అక్టోబరు 13వ తేదీ అర్ధరాత్రి చోటు చేసుకుంది. తెన్నేటి పార్కు తీరానికి వచ్చేసిన నౌకను చూసేందుకు నిత్యం వందలాది మంది వస్తూనే ఉన్నారు.
- బంగ్లాదేశ్‌కు చెందిన ‘ఎం.వి.మా’కు సంబంధించిన పలు ప్రక్రియలు పూర్తి చేయడానికి పలు దేశాల అధికారులు, వివిధ సంస్థల ఉన్నతోద్యోగులు చర్చలు నిర్వహించాల్సి వచ్చింది. అదెలాగంటే..
- బంగ్లాదేశ్: ఈ నౌక బంగ్లాదేశ్‌కు చెందినది
- లండన్: లండన్‌కు చెందిన ‘ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్’(ఐ.టి.ఎఫ్.) కూడా రంగంలోకి దిగింది. నౌక సిబ్బందిని సాధ్యమైనంత వేగంగా వారి దేశాలకు పంపడానికి ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
- సింగపూర్: సింగపూర్‌లోనూ ఉన్న ‘రిసాల్వ్ మెరైన్’ నిపుణులు ఇక్కడికి వచ్చి నౌకను పరిశీలించారు.
- అమెరికా: జలాల్లో నుంచి నౌకను శాస్త్రీయంగా తొలగించడానికి నిర్వహించే ‘సాల్వేజ్’ ప్రక్రియను నౌక యజమానులు యు.ఎస్.కు చెందిన ‘రిసాల్వ్ మెరైన్’ అనే సంస్థకు అప్పగించారు.
- ఆంధ్రప్రదేశ్: నౌకను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి నౌకాశ్రయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాలి.
సింగపూర్ నుంచి వచ్చిన నిపుణులు నౌకను సమీపంలోని షిప్‌యార్డ్‌కు పంపి అవసరమైన చర్యలు తీసుకోవాలని భావించారు. అందుకు వీలుగా నౌకాశ్రయ అధికారులకు, షిప్‌యార్డ్ అధికారులకు లేఖలు రాశారు. నిబంధనల ప్రకారం ముందుగా నౌకాశ్రయానికి ఆ తరువాత షిప్‌యార్డ్‌కు తరలించాల్సి ఉంటుంది. నౌకాశ్రయంలోకి నౌకను అనుమతించడానికి ‘రిజిస్ట్రార్ ఆఫ్ షిప్పింగ్’ నుంచి అనుమతిపొందాలని విశాఖ నౌకాశ్రయ అధికారులు సూచించారు. లేఖ రాసినా అక్కడి నుంచి అనుమతి నిరాకరించారు. దీంతో ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో నౌకను తాము వదిలేస్తున్నామని విశాఖ నౌకాశ్రయ అధికారులకు వర్తమానం పంపారు. ఫలితంగా నౌకను నౌకాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి మార్గం సుగమం అయినట్లైంది.
1.49 లక్షల లీటర్ల ఇంధనం