ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యాటకశాఖలోని ఉద్యోగాలన్నీ... స్థానిక గిరిజనులకే - Tourism Minister Muttamshetti Srinivas inaugurates Drive-in Restaurant under Tourism Department

అరకులోయలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్​ని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. పర్యాటక శాఖలోని ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులకే ఇస్తామని హామీ ఇచ్చారు.

Tourism Minister Muttamshetti Srinivas in vishakapatnam latest

By

Published : Oct 4, 2019, 8:07 PM IST

పర్యాటక శాఖలోని ఉద్యోగాలు అన్ని స్థానిక గిరిజనులకే

అరకు లోయను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.156 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్​ను ఆయన ప్రారంభించారు. అరకు లోయ నుంచి లంబసింగి వరకు పలు పనులను చేపడుతున్నామన్నారు. గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గిరిజన విశ్వవిద్యాలయం ,వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. గిరిజనులకు ఎంతో ఆవేదనకు గురి చేస్తున్న బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. పర్యాటక శాఖలోని ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులకే ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి ,చిట్టి ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details