ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నం మునిసిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ - narsipatanam latest news

విశాఖ జిల్లా నర్సీపట్నం మునిసిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు గెలుపొందిన కౌన్సిలర్లను స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విశాఖకు తీసుకెళ్లారు. అక్కడ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్​తో భేటీ అయ్యారు.

tough-competition-for-chairman-vice-chairman-position-in-narseepatnam-municipality
నర్సీపట్నం మునిసిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ

By

Published : Mar 17, 2021, 8:40 PM IST

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మునిసిపల్ కౌన్సిలర్లను స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ విశాఖకు తీసుకెళ్లి ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్​తో భేటీ అయ్యారు. నర్సీపట్నం మునిసిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీ 14 వార్డులను, తెదేపా 12 వార్డులను, జనసేన ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డును సొంతం చేసుకున్నారు. నర్సీపట్నం ఛైర్మన్ పీఠాన్ని ఎస్సీ మహిళకు కేటాయించటంతో... మూడు వార్డుల నుంచి గెలుపొందినవారు ఛైర్మన్ కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. ఈ అంశంపై అధికార వైకాపా నిర్ణయం తీసుకోవలసి ఉంది.

ABOUT THE AUTHOR

...view details