ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాడుగులలో కరోనా ఉద్ధృతి.. ఇప్పటివరకు 550 మందికి పాజిటివ్ - madugula latest news

విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఇప్పటివరకు 550 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు నియోజకవర్గ కొవిడ్ ప్రత్యేకాధికారి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అనిత తెలిపారు. కె.కోటపాడులో పర్యటించిన ఆమె మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

total five hundred and fifty news corona positive cases registered in madugula constituency in vizag district
ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అనిత

By

Published : Sep 17, 2020, 6:03 AM IST

విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని కె.కోటపాడు మండలంలో 214, మాడుగుల మండలంలో 162, దేవరాపల్లి మండలంలో 104, చీడికాడ మండలంలో 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నియోజకవర్గ కొవిడ్ ప్రత్యేకాధికారి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అనిత తెలిపారు. ఈ నేపథ్యంలో మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details