ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నష్టాల్లో టమాటా రైతు.. గిట్టుబాటు లేక దిగాలు - vishaka tomato farmers difficulties

విశాఖ జిల్లా దేవరాపల్లి కూరగాయల మార్కెట్ లో టమోటా ధరలు పడిపోయాయి. ధరలు భారీగా తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ వ్యాపారులు అందరూ సిండికేట్ అయి.. ధరలు తగ్గిస్తున్నారని రైతులు చెబుతున్నారు.

tomato farmers difficulties
టమాటా రైతు కష్టాలు

By

Published : Mar 25, 2021, 12:07 PM IST

టమాటా రైతు కష్టాలు

టమాటా రైతుకు కన్నీరే మిగులుతోంది. కనీసం కోత ఖర్చులూ రాకపోవడంతో టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు మార్కెట్లు, మాల్స్‌లో కిలో రూ.30 పలుకుతున్నా.. రైతు వద్దకు వచ్చే సరికి రూ.5కూడా పడటం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో రైతులు టమోటా పంట సాగుచేస్తారు. ఈ ప్రాంతంలో పండించిన పంటను దేవరాపల్లి రోజువారి హోల్ సేల్ మార్కెట్​లో విక్రయిస్తారు. ఒకేసారి టమాటా కోతకు రావడంతో మార్కెట్‌లో ధరలు పతనమయ్యాయి.

టమాటా రైతు కష్టాలు

ఇక్కడ వ్యాపారులు సిండికేట్​గా మారి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కిలోకి రూ.5 మించి రావట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారీ వ్యవస్థ నుంచి రైతులను కాపాడి.. ప్రభుత్వం మద్ధతు ధర కల్పించాలని కోరుతున్నారు. కూరగాయలు నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

టమాటా రైతు కష్టాలు

ఇదీ చదవండి: నేడు ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details