'యుద్ధాలు వద్దు-ప్రపంచశాంతి ముద్దు' అనే నినాదంతో ఇస్కఫ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జపాన్లోని హీరోషిమాపై బాంబు దాడి జరిగి నేటికి 74 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇది నిర్వహించారు. ఆ బాంబు దాడిలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారనీ.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని వక్తలు వ్యాఖ్యానించారు. ఆ చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయన్నారు. దేశాలన్నీ శాంతియుతంగా మెలగాలని ఆకాంక్షించారు.
'యుద్ధాలు వద్దు-ప్రపంచశాంతి ముద్దు' - day
జపాన్లోని హీరోషిమా పట్టణంపై బాంబు దాడి జరిగి నేటికి 74 ఏళ్లు పూర్తయ్యాయి. దీన్ని పురస్కరించుకుని విశాఖలో యుద్ధాలు వద్దు-ప్రపంచశాంతి ముద్దు అనే నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

'యుద్ధాలు వద్దు-ప్రపంచశాంతి ముద్దు'