ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైల్లో తొక్కిసలాట-ఒకరు మృతి - తిరుమల ఎక్స్‌ప్రెస్‌

తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. విశాఖ నుంచి తిరుపతి వెళ్లే ఈ రైలు స్టేషన్‌లో బయలు దేరే సమయంలో రద్దీ కారణంగా ఇద్దరు వ్యక్తులు జారిపడ్డారు. రైలుకు, ఫ్లట్​ఫారం మధ్య ఉన్న సందులో ఓ వ్యక్తి పడిపోవడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు.

tirumal-express

By

Published : Jun 20, 2019, 10:39 AM IST

తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైల్లో తొక్కిసలాట-ఒకరు మృతి

విశాఖ నుంచి తిరుపతి వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైల్లో జరిగిన తొక్కిసలాట ఒక ప్రాణాన్ని బలిగొంది. నిన్న మధ్యాహ్నం విశాఖ రైల్వే స్టేషన్‌లో రైలు బయలుదేరుతున్న సమయంలో.... తీవ్ర రద్దీ కారణంగా బోగీ నుంచి ఇద్దరు వ్యక్తులు జారిపడ్డారు. విశాఖ జిల్లా రావికమతానికి చెందిన జనపరెడ్డి రాజు... రైలుకు, ఫ్లాట్‌ఫారం మధ్య ఉన్న సందులో పడిపోయాడు. తలకు, నడుముకు బలమైన గాయాలవగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జనపరెడ్డిరాజు కన్నుమూశాడు. విశాఖ-తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైల్లో బాగా రద్దీ పెరిగినా... అందుకు అనుగుణంగా జనరల్ బోగీలను పెంచకపోవడం వల్ల ప్రతీరోజు తొక్కిసలాటలు జరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details