ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టిడ్కో లబ్ధిదారులకు ఇంటి తాళాలు ఇస్తానన్న ఎమ్మెల్యే.. కానీ చివరకు - ఏపీ తాజా వార్తలు

TIDCO Houses Beneficiaries Protest In Visakha : ఓ ఎమ్మెల్యే టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఇంటి తాళాలు ఇస్తానని చెప్పి సమావేశానికి రమ్మన్నారు. అయితే ఇంటి తాళాలు వస్తాయన్న ఆశతో ఆ మహిళలంతా పనులు మానుకుని మరీ వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక ఆ ఎమ్మెల్యే తాళాలు ఇవ్వకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో జరిగింది.

TIDCO Houses Beneficiaries Protest In Visakha
TIDCO Houses Beneficiaries Protest In Visakha

By

Published : Nov 23, 2022, 7:43 PM IST

TIDCO Houses Beneficiaries Protest : విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని టిడ్కో గృహాల లబ్ధిదారులందరికీ ఇంటి తాళాలు ఇస్తామని చెప్పి సమావేశానికి హాజరు కావాల్సిందిగా వైసీపీ ఎమ్మెల్యే అన్నం అదీప్​రాజ్ సమాచారమిచ్చారు. ఇళ్ల తాళాలు ఇస్తారన్న ఆశతో మహిళలంతా.. తమ పనులు మానుకుని మరీ సమావేశానికి హాజరయ్యారు. అయితే సమావేశం ప్రారంభమైన కొద్దిసేపు మాత్రమే ఎమ్మెల్యే ప్రసంగించి,.. మిగతాది తన తమ్ముడు పర్యవేక్షిస్తారని చెప్పి.. సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు మహిళలు ఆరోపిస్తున్నారు.

అయితే ఎమ్మెల్యే తమ్ముడు కూడా కొంతసేపు చూసి అక్కడినుంచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి తాళాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటంతో మహిళలు ఆందోళనకు దిగారు. వీడియో సందేశాలు చేసి ఎమ్మెల్యే అదీప్​రాజ్​ను వెనక్కి పిలిపించటానికి ప్రయత్నించినా.. ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఇంటి తాళాలు వస్తాయని ఎంతో ఆశతో వచ్చిన ఆ మహిళలు ఉసూరుమనుకుంటూ వెనుదిరిగారు.

టిడ్కో లబ్ధిదారులకు ఇంటి తాళాలు ఇస్తానని రమ్మన్న ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details