విశాఖ జిల్లా చోడవరం, అనకాపల్లిలో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.. - todays vishaka district rain news
విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షంజిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం
ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్షం విత్తనాలు వేసేందుకు ఉపయోగపడుతుందాని అన్నదాతలు తెలిపారు.