ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఏజెన్సీలో గిరిజనుడిని.. తుపాకీతో కాల్చి చంపిన దుండగులు - tribal killed in Visakhapatnam

విశాఖ ఏజెన్సీలో దుండగులు ఓ గిరిజనుడిని తుపాకీతో కాల్చి చంపారు. పాతకక్షలతో మృతుడి బంధువులే ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

విశాఖ ఏజెన్సీలో గిరిజనుడిని తుపాకీతో కాల్చి చంపిన దుండగులు
విశాఖ ఏజెన్సీలో గిరిజనుడిని తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

By

Published : Feb 13, 2022, 7:42 PM IST

విశాఖ ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది. చింతపల్లి మండలం బూసిబంధ అటవీ ప్రాంతంలో దుండగులు ఓ గిరిజనుడిని తుపాకీతో కాల్చి చంపారు. మృతుడు సుమత్ (50)గా గుర్తించారు. తుపాకీతో కాల్చిన తర్వాత కత్తితో పొడిచి చంపారు. రెండ్రోజల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మృతుడి బంధువులు పెంటయ్య, నాగేశ్వరరావులే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details