maoists arrest in manyam : విశాఖ మన్యంలోని గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ అటవీప్రాంతంలో ముగ్గురు మహిళా మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ ఏరియా కమాండర్‌గా పనిచేస్తున్న మర్రి వలసి అలియాస్ భారతి, పార్టీ సభ్యురాలు వంతల దేవి అలియాస్ టెకుమో, దళ సభ్యురాలు కొర్రా దేవి అలియాస్ సీతను కొయ్యూరు మండలం మంప పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు అరెస్టు చేశారు.
maoists arrest in manyam : ముగ్గురు మహిళా మావోయిస్టులు అరెస్టు - manyam
maoists arrest in manyam : ముగ్గురు మహిళా మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వారి వద్ద నుంచి కరపత్రాలు, డిటోనేటర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
వీరిలో మర్రి వలసిపై రూ.4 లక్షలు, మిగతా ఇద్దరిపై రూ.లక్ష చొప్పున ప్రభుత్వ రివార్డు ఉంది. వీరు ముగ్గురూ 2007 నుంచి గాలికొండ, కోరుకొండ, పెదబయలు, కటాఫ్, ఒడిశా, ఏవోబీ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీలతో కలిసి తిరిగారు. వీరి నుంచి డిటోనేటర్లు, ఎలక్ట్రికల్ వైర్, బ్యాటరీలు, స్టీల్ క్యారేజీ, పిస్తోల్ పౌచ్, దేశవాళీ పిస్తోలు, 7.65 రౌండ్లు, డైరీలు, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు, మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఎస్పీ కృష్ణారావు పిలుపునిచ్చారు.
ఇదీచదవండి: KODALI NANI IN BHADRACHALAM : భద్రాద్రి రామయ్య సేవలో మంత్రి కొడాలి నాని