ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధురవాడకు చెందిన తమ్మినేని మహేశ్, ఆశారాజు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి 26 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పరిధిలో బైకులను దొంగిలించినట్లు నగర కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు. వీరిపై వివిధ పోలీసు స్టేషన్లలో 23కేసులు నమోదైనట్లు తెలిపారు.
ద్వారకా పోలీసు స్టేషన్ పరిధిలో సెల్ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న సత్యనారాయణ అనే మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాస్టళ్లు, బ్యాచ్లర్ రూములే లక్ష్యంగా నిందితుడు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. అతని వద్ద నుంచి 20 మెుబైల్ఫోన్లతో పాటు 15 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేశామన్నారు.