విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలోని గ్రామాల్లో కరోనా వైరస్ ప్రబలుతోంది. తాజాగా పెదవేగి మండలంలో ఇద్దరు, హుకుంపేట మండలంలో ఓ గర్భిణి వైరస్ బారినపడ్డారు. బాధితులకు స్థానిక యూత్ సెంటర్ కొవిడ్ కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గర్భిణులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని అధికారులను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఒక వైద్య అధికారిని నియమించి ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నట్లు అధికారులు వివరించారు.
మన్యంలో కొవిడ్ పంజా.. ముగ్గురు గర్భిణులకు పాజిటివ్ - వైరస్ బారినపడ్డ ముగ్గురు గర్భిణులు
విశాఖ మన్యంలోని పలు గ్రామాల్లో కొవిడ్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా సోమవారం ఒక్కరోజే 185 మంది వైరస్ బారినపడ్డారు. కరోనా సోకిన ముగ్గురు గర్భిణులకు స్థానిక యూత్ సెంటర్ కొవిడ్ కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మాన్యంలో పంజా
ఇటీవల కాలంలో మాన్యంలోని చాలా గ్రామాల్లో కొవిడ్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా సోమవారం ఒక్కరోజే 185 మంది వైరస్ బారినపడ్డారు. మరణాలు కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం 40 వరకు ఉన్నాయి. దీంతో స్థానికంగా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి..బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్: రాష్ట్రంలో 4 మరణాలు.. వందలాది కేసులు