విశాఖ జిల్లాలో మూడు వేర్వేరు ఘటనల్లో.. ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.
మాకవరపాలెంలో...
మాకవరపాలెం మండలం గిడుతూరు గ్రామానికి చెందిన దొరబాబు అనే ఐటిఐ విద్యార్థి.. విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. దొరబాబు అదే గ్రామంలో.. మేకల శ్రీను అనే వ్యక్తి ఇంటికి వెళ్లి విద్యుత్ పనులు చేస్తుండగా స్తంభం ఎక్కాల్సి వచ్చింది. పనులు ముగించుకొని కిందకి దిగుతూ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన దొరబాబును 108 వాహనంలో నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మాకవరపాలెం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మునగపాక మండలం తోటాడలో ...
మునగపాక మండలం తోటాడలో పాము కాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. పి నారాయణ (46) అనే వ్యక్తి రోడ్డుపై నడిచి వెళ్తుండగా పాము కాటేసింది. గమనించిన స్థానికులు.. బాధితుడిని అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. బజ్జీలు వేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న నారాయణ మృతిచెందడంతో.. కుటుంబ సభ్యులు రోదినలు మిన్నంటాయి.
గవర్ల అనకాపల్లిలో...
మునగపాక మండలం గవర్ల అనకాపల్లిలో.. అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందాడు. కరక్పూర్కు చెందిన శివ గణేష్(40) అనే వ్యక్తి ఐదేళ్లుగా ఫార్మాసిటీలో పని చేస్తున్నాడు. రెండ్రోజుల క్రితం.. అతని భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేని సమయంలో.. శివ గణేష్ మృతిచెందాడు. మృతదేహాన్ని మునగపాక ఎస్ఐ శ్రీనివాసరావు పరిశీలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
దారుణం: చిన్నారి మీద పైశాచికత్వం.. ఎవరిదీ పాపం?