విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట గ్రామంలో విషాదం (tragedy) చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పెద్దేరు నది (pedderu river)లో మునిగి ముగ్గురు మృతి చెందారు. మృతులు వడ్డాది గ్రామానికి చెందిన గుడ్ల రాము (48), కొల్లి మల్ల శ్రీను (45), గొలుగొండకు చెందిన షికారు దారకొండ (65)గా గుర్తించారు.
విషాదం : పెద్దేరు నదిలో మునిగి ముగ్గురు మృతి - vizag-district crime
16:27 July 11
విశాఖపట్నం జిల్లా బంగారుమెట్ట వద్ద ఘటన
వీరు ముగ్గురు రమణ అనే మరో వ్యక్తితో కలిసి వడ్డాది నుంచి పోతనపూడి ఆగ్రహారానికి బయలు దేరారు. దగ్గరగా ఉంటుందని భావించి పొలాల మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. మధ్యలో బంగారు మెట్ట వద్ద పెద్దేరు నది దాటేందుకు నీటిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో అందులో మునిగారు. ముందు నీటిలో దిగిన ముగ్గురు మునిగిపోవడం చూసిన రమణ భయపడి వెనక్కి వచ్చేశాడు. గ్రామంలోకి వెళ్లి విషయాన్ని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: