ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం అనుకొని స్పిరిట్​ తాగి ముగ్గురి మృతి - విశాఖపట్నం నేర వార్తలు

విశాఖపట్నం జిల్లా కశింకోటలో విషాదం నెలకొంది. నాటుసారా అనుకుని స్పిరిట్ తాగడం వల్ల ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Three people death to drink akchohol in laseem kota vizag district
మద్యంగా భావించి.. స్పిరిట్ తాగి ముగ్గురు మృతి

By

Published : May 31, 2020, 2:06 PM IST

Updated : May 31, 2020, 3:04 PM IST

విశాఖ జిల్లా కశింకోటలో నాటుసారా అనుకొని స్పిరిట్​ తాగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. శనివారం రాత్రి ఐదుగురు వ్యక్తులు కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఇవాళ ఉదయం లేచే సరికి ఆనంద్‌, నూకరాజు అనే ఇద్దరు మృతిచెందగా...అప్పారావు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం కేజీహెచ్​కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అప్పారావు మృతి చెందాడు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మద్యం సీసాను పరిశీలనకు పంపించగా...సర్జికల్‌ స్పిరిట్‌గా గుర్తించినట్లు అనకాపల్లి గ్రామీణ సీఐ నరసింహరావు తెలిపారు.

Last Updated : May 31, 2020, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details