ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని లమతపుట్ సమితి దేవగందన గ్రామానికి చెందిన పూజ తమిలి, నికిత దళపతి, సంతోషిపత్రి అనే ముగ్గురు బాలికలు సోమవారం నుంచి కనిపించకుండా పోయారు. మంగళవారం గ్రామం సమీపంలోని చెరువు వద్ద బాలికల చెప్పులు కనిపించడంతో చెరువులో వెతకగా... అప్పటికే ముగ్గురూ మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న నందాపూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మృతదేహలను బయటకి తీసి, శవపరీక్ష నిర్వహించారు.
విషాదం... చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని లమతపుట్ సమితి దేవగందన గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి
ఘటనా స్థలానికి చేరుకున్న కొరాపూట్ శాసన సభ్యుడు రఘురాం పడల్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. రెడ్ క్రాస్ తరపున రూ.పది వేలు ఆర్థిక సహాయం అందించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు విగతజీవులుగా మారటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీచదవండి.