ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ జిల్లాలో వివిధ ప్రాంతాలలో చెరువులోపడి ముగ్గురు మృతి - విశాఖ జిల్లా తాజా వార్తలు

విశాఖ జిల్లాలో వివిధ ప్రాంతాలలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు. వీరి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

Three died in the pond at visakha
విశాఖ జిల్లాలో వివిధ ప్రాంతాలలో చెరువులోపడి ముగ్గురు మృతి

By

Published : Sep 19, 2020, 11:21 PM IST

విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధి సంగివలసలకు చెందిన బాలుడు గోస్గతనీనదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. గోస్తనీ నదిలో నలుగురు స్నేహితులు ఈత కోసం దిగారు. నది ప్రవాహానికి గుర్రాల హరీష్(10) అనే బాలుడు గల్లంతయ్యాడు. మిగిలిన స్నేహితులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం హరీష్ తల్లిదండ్రులు వీరిని నిలదీయడంతో గల్లంతైన విషయం బయటపడింది. రాత్రంతా వెదికినా ఫలితం లేకపోయింది. ఉదయం నదిలో బాలుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు

చెరువులోపడి బాలుడు మృతి

ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా యస్ రాయవరం మండలం లింగరాజు పాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన కంకిపాటి వీరన్న (41) చెరువులో కాళ్లు శుభ్రం చేసుకునేందుకు దిగాడు. ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలోపడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు ఈత గాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రానికి వీరన్న మృతదేహాన్ని బయటకు తీశారు.

చెరువులోపడి వ్యక్తి మృతి

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి బలిఘట్టం గ్రామానికి చెందిన శ్రీను అనే పాడి రైతు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. బలిఘట్టం గ్రామానికి చెందిన శ్రీను గ్రామానికి సమీపంలో ఉన్న కంబాల చెరువు వద్దకు తన పశువులను మేతకు తీసుకెళ్లాడు .పశువులు నీరు తాగడానికి సమీపంలోని కంబాల చెరువు వద్దకు వెళ్లాయి. పశువులను ఒడ్డుకు చేర్చే క్రమంలో రైతు శ్రీను ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. సమీపంలోని మిగతా రైతులు శ్రీనుని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. నర్సీపట్నం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని శ్రీను మృతదేహాన్ని వెలికి తీశారు. నర్సీపట్నం గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి.కొవిడ్​ నిబంధనలు గాలికి...ఆటోలో గుంపులుగా..

ABOUT THE AUTHOR

...view details