విశాఖ ఏజెన్సీలో ఒకేరోజు ముగ్గురు చిన్నారులు అనారోగ్యంతో మరణించారు. జి.మాడుగుల మండలంలో మూడు గ్రామాల్లో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. వంజరి పంచాయతీ పద్మాపురంలో పదేళ్ల కొండపల్లి శ్రావ్య తీవ్ర జ్వరంతో చికిత్స పొందుతూ.. నర్సీపట్నం ఆసుపత్రిలో చనిపోయింది. కుంబిడిసింగి పంచాయతీ గద్దెరాయిలో నాలుగు నెలల బాబు.. అనారోగ్యంతో మృతి చెందాడు. అలాగే కోరాపల్లి పంచాయతీ కుమ్మరి పుట్టులో రెండు నెలల బాబు.. మరణించాడు. ఈ మండలంలో చిన్నారుల మరణం ప్రశ్నార్థకంగా మారింది.
విశాఖ ఏజెన్సీలో.. ఒకేరోజు ముగ్గురు చిన్నారులు మృతి - విశాఖ ఏజెన్సీలో జ్వరం వార్తలు
విశాఖ జిల్లా జి. మాడుగుల మండలంలోని గ్రామాల్లో.. ఒకేరోజు ముగ్గురు చిన్నారులు అనారోగ్యంతో మృతిచెందారు. ఈ మండలంలో చాలాకాలంగా చిన్నారులు మరణిస్తున్నారు.
విశాఖ ఏజెన్సీలో ముగ్గురు చిన్నారులు మృతి