విశాఖ మన్యంలో సంచలనం కలిగించిన నాటు వైద్యుని హత్య, దహనం కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. జీ మడుగుల మండలం సెరిబయలులో నాటువైద్యం పొందుతున్న రోగి మృతి చెందడంతో... అతనిపై కక్ష పెంచుకున్న వీరు... నాటు వైద్యం జగ్గారావును కొట్టి చంపి దహనం చేశారు. నాటు వైద్యుని కుమారుడు.... తన తండ్రి మృతదేహాన్ని అప్పగించాలని అడగ్గా... నిందితులు రవిని బెదిరించి పంపించారు. దీంతో మృతుని కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి సీఐ శ్రీనివాస్ ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యం పొందాలని నాటువైద్యానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
నాటువైద్యుడి దారుణ హత్య కేసులో... ముగ్గురు అరెస్టు - నాటు వైద్యుని హత్య కేసులో ముగ్గురు అరెస్టు
ఈనెల 18న జగ్గారావు అనే నాటువైద్యుడు సేరిబయలుకు చెందిన మర్రి ముసిరి అనే వ్యక్తికి వైద్యం చేయగా.. అది వికటించి అతను మృతిచెందాడు. కేసులో విశాఖ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హజరుపరిచారు.
![నాటువైద్యుడి దారుణ హత్య కేసులో... ముగ్గురు అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4850002-395-4850002-1571869619843.jpg)
నాటు వైద్యుని హత్య కేసులో ముగ్గురు అరెస్టు
నాటు వైద్యుని హత్య కేసులో ముగ్గురు అరెస్టు