ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సరైన నిఘా లేనందునే మోసాలు జరుగుతున్నాయి' - updates on appanna gold scam

అప్పన్నబంగారం అమ్ముతామంటూ జరిగిన మోసంలో ఇంటి దొంగల పాత్ర పట్టు బడింది. దేవాలయ సిబ్బంది ఇందులో కీలక పాత్ర ,ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేయడం ఇందులో కీలక పరిణామం. ఈ వ్యవహారంలో దాదాపు రూ.38 లక్షల వరకు చేతులు మారినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పొరుగు సేవల సిబ్బందిపై సరైన నిఘా కొరవడినందునే మోసాలు జరిగినట్లు తెలుస్తోంది.

three arrested in appanna gold scam
three arrested in appanna gold scam

By

Published : Sep 10, 2020, 11:43 AM IST

సింహాచలం అప్పన్న బంగారం అమ్మకం పేరిట జరిగిన టోకరా కేసులో 38 లక్షలు మోసానికి పాల్పడినట్టుగా పోలీసులు నిర్థరించారు. దేవస్థానం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందిపై సరైన నిఘా లేనందునే ఇలాంటి మోసాలకు తావిచ్చినట్లు అవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బంగారం అమ్ముతామంటూ జరిగిన మోసంలో ముగ్గురు దేవస్థానం పొరుగు సేవల సిబ్బంది, వారి బంధువు అరెస్టు మరికొందరిలోనూ గుబులు పుట్టిస్తోంది. కోటి నలభై నాలుగు లక్షల రూపాయల మేర అప్పన్న బంగారం కోసం చెల్లించానని చెబుతున్న సూళ్లూరుపేట మహిళ ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తరహా మోసాలు పై ఇప్పుడు దేవస్థానం అంతర్గతంగా మరింత లోతుగా శోధన చేయాల్సి ఉందన్న వాదన వినిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details