Illegally selling of pentazocine lactate injections: శస్త్రచికిత్సల్లో నొప్పిని నివారించే పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు అక్రమంగా అమ్ముతున్న నిందితులను.. విశాఖ టాస్కుఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3 వేల ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఖరగ్పూర్లో ఒక బాక్సు ఇంజెక్షన్లు రూ.1300కు కొనుగోలు చేసి, విశాఖపట్నంలో రూ.2వేలకు అమ్ముతున్నట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
విశాఖలో విద్యార్థులు, యువత మత్తు మందులకు అలవాటు పడుతున్నారని, వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఇంజెక్షన్ల దందా సాగుతోందని.. పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ హెచ్చరించారు. పశ్చిమబెంగాల్ నుంచి పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు తీసుకొచ్చి లీలామహల్ జంక్షన్లో విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు నిఘా పెట్టినట్లు చెప్పారు.