ఇరవై రోజులుగా విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఓ పక్క ఉక్కపోత పెరిగిపోతుంటే.. మరోపక్క పొగమంచు వ్యాపించింది. పగలంతా వేసవి తాపం చూపిన భానుడుని మేఘాలు కప్పేశాయి. సాయంకాలం వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావటంతో వేసవి కాస్త.. శీతాకాలాన్ని తలపించింది. దట్టంగా అలుముకున్న పొగమంచు... చిరుజల్లులను తలపించింది. దీంతో అక్కడికి పర్యటకులు ఆనందోత్సాహాలతో ప్రకృతిని ఆస్వాదించారు.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా... మన్యంలో శీతాకాలపు అందాలు - beauty of manyam news
వేసవి కాలం ప్రారంభమైంది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కానీ విశాఖ మన్యంలో మాత్రం పొగమంచు దట్టంగా అలుముకుని చూపరులను ఆకట్టుకుంటోంది.
![ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా... మన్యంలో శీతాకాలపు అందాలు thick fog spread at manyam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11000117-20-11000117-1615696380780.jpg)
మన్యంలో శీతాకాలపు అందాలు