ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎక్స్​-రే తీయించుకోవాలంటే రూ.3వేలు కావాల్సిందే - corona in arakuloya

అరకులోయ ప్రభుత్వాస్పత్రిలో మూడున్నర నెలలనుంచి రేడియాలజిస్ట్ లేకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్​డౌన్​ వేళ ఎక్స్​రే కావాలంటే ముడు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

There was no radiologist in arakuloya hospital
అరకులోయలో రోగుల ఎక్స్​ రే సమస్యలు

By

Published : May 13, 2020, 7:32 PM IST

ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో అన్నీ ఉచితమే.. అందుకోసం పేదవారు ప్రభుత్వాస్పత్రులకు వస్తుంటారు. కానీ విశాఖ జిల్లా అరకులోయ ప్రాంతీయ వైద్య కేంద్రంలో రేడియాలజిస్ట్ మూడున్నర నెలలనుంచి లేకపోవడంతో...రోగులు పాడేరులోని ఆసుపత్రికి వెళ్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూ.3000లను వెచ్చించి 60 కిలోమీటర్ల దూరంలోని పాడేరు జిల్లా వైద్య కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ప్రస్తుత లాక్​డౌన్ పరిస్థితుల నేపథ్యంలో బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాల్లో రోగులు పాడేరుకి వెళ్తున్నారు. ఇందుకోసం రూ. 3 వేల వరకు ఖర్చవుతుందని బాధితులు వాపోతున్నారు. కొంతమంది పేద రోగులు గత్యంతరం లేని పరిస్థితుల్లో వైద్యం చేయించుకోకుండానే వెనక్కి వస్తున్నారు. మరికొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు వెచ్చించి పాడేరు వెళ్లి ఎక్స్ రే తీయించుకొని వస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి వైద్య ఆరోగ్య అధికారులు చర్యలు చేపట్టి రేడియాలజిస్టులు నియమించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details