ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేంద్ర బడ్జెట్ లో దళిత, గిరిజన యువత ప్రస్తావనే లేదు' - కేంద్ర బడ్జెట్ లో దళితలు ప్రస్తావనే లేదు

దళితుల ప్రస్తావన లేని కేంద్ర బడ్జెట్... అసమానతలను పెంచే విధంగా ఉందని.. దళిత హక్కుల పోరాట సమితి ప్రతినిధులు విశాఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్ గిరిజన యువతను నిరాశపరిచిందన్నారు.

On the basis of population, Rs. 11.6 lakh crore should be allocated
'జనాభా ప్రాతిపదికన దళిత గిరిజనులకు రూ. 11.6 లక్షల కోట్లు కేటాయించాలి'

By

Published : Feb 5, 2021, 12:00 PM IST

దళితుల ప్రస్తావన లేని కేంద్ర బడ్జెట్ మరింత అసమానతలను పెంచే విధంగా ఉందని.. దళిత హక్కుల పోరాట సమితి ప్రతినిధులు విశాఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయల కల్పన పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలలోకి ఎఫ్.డి.ఐలను అనుమతించటం తగదన్నారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్ గిరిజన యువతను నిరాశపరిచిందని చెప్పారు.

నిరుద్యోగ దళిత యువతకు నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులు ప్రశ్నార్థకంగా మారాయని ఆందోళన చెందారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు మరింత పేదరికంలో పడేటట్లు కేంద్ర బడ్జెట్ ఉందని వారు పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన దళిత గిరిజనులకు రూ. 11.6 లక్షల కొట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details