విజయవాడ దుర్గాపురంలోని సాంబమూర్తి రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీ దొంగతనం జరిగింది. రాత్రి షాపునకు తాళం వేసి వెళ్లిన సిబ్బంది.. ఉదయం వచ్చేసరికి దుకాణం తెరిచి ఉంది. దుకాణంలోని కౌంటర్లో ఉన్న సుమారు రూ.13లక్షల నగదు మాయమైంది. దీనిపై షాపు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సీసీఎస్ డీసీపీ బోస్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Theft: మద్యం దుకాణంలో రూ.13 లక్షలు చోరీ - krishna district latest news
విజయవాడలోని దుర్గాపురంలో మద్యం షాపులో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
theft in wine shop
ఈ ఘటనలో ఇంటి దొంగల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు సత్యనారాయణపురం పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:ఆన్లైన్లో 5 సార్లు బుక్ చేసినా.. 'బిస్కెట్ అయ్యింది!'
Last Updated : Jun 14, 2021, 3:14 PM IST