విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఓ బంగారు వస్తువుల తయారీ దుకాణంలో జరిగిన చోరీ కేసును పట్టణ పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.దుకాణంలో పనిచేస్తున్న మహేంద్ర కుమార్ అనే వ్యక్తే నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతనితో పాటు అతనికి సహకరించిన విక్రమ్ సింగ్ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 707 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలతో పాటు దేశీయంగా తయారైన నాటు తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.
బంగారు దుకాణంలో చోరీ.. ఇద్దరు అరెస్టు - అనకాపల్లిలో బంగారం దొంగతనం
బంగారు తయారీ దుకాణంలో జరిగిన చోరీ కేసును విశాఖ జిల్లా అనకాపల్లి పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 707 గ్రాముల బంగారంతో పాటు నాటు తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.
బంగారు దుకాణంలో చోరీ..ఇద్దరు అరెస్టు