విశాఖ జిల్లా అనకాపల్లి,సాయినగర్ లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది.బీరువాలో8తులాల బంగారం,రూ. 30వేల నగుదు,వెండి వస్తువులు దొంగలు కాజేసినట్టు ఇంటి యజమాని చెప్పారు.మాధవి అనే మహిళ ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న అన్నయ్య ఇంటికి రాత్రి పడుకోవటానికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు.అనంతరం కేసు నమోదు చేసి,దర్యాప్తును ప్రారంభించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ..నగదు, బంగారం అపహరణ - robbery news in anakapally sainagar
ఇంటికి తాళం వేసి పక్కన ఉన్న బంధువుల ఇంటికి పడుకోవడానికి వెళ్లిన సమయంలోఇంట్లోకి దుండగులు ప్రవేశించి బంగారం, నగదును చోరీ చేశారు. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటుచేసుకుంది.
తాళం వేసిన ఇంట్లో చోరీ... నగదు, బంగారం అపహరణ