ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో దొంగతనాలు.. ఆందోళనలో స్థానికులు - విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ద్విచక్రవాహనలు దొంగతనం

విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. ద్విచక్ర వాహనాలు, బంగారం అపహరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అనుమానితులను గుర్తించే పనిలో పడ్డారు. విలువైన వస్తువులకు చోరీకి గురవుతుండటంతో.. గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

theft at vishaka agency areas
విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో దొంగతనాలు.. ఆందోళనలో స్థానికులు

By

Published : Feb 22, 2021, 3:01 PM IST

విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తుల దొంగతనాలతో గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు. ఖరీదైన ద్విచక్ర వాహనాలతో పాటు ఇళ్లల్లోకి చొరబడి నగదు, బంగారాన్ని దొంగలిస్తున్నారు. చింతపల్లి , గూడెం కొత్తవీధి , సీలేరు రహదారుల్లో.. వాహనాల్లో ప్రయాణించే వారిపై దాడిచేసి చరవాణీలు, బంగారాన్ని అపహరిస్తున్నారు. నడింపాలెం , రామరాజుపాలెం , కొండగోకిరి , రాజేంద్రపాలెంలో విలువైన వస్తువులను దొంగిలిస్తుండటంతో.. బాధితులు లబోదిబోమంటున్నారు. స్థానికుల పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. వారు గ్రామానికి వస్తున్న కొత్త వ్యక్తులు, అనుమానితులను గుర్తించే పనిలో పడ్డారు. గ్రామాల్లో 5 ద్విచక్ర వాహనాలతో పాటు బంగారం, నగదు, 10 చరవాణీలు దొంగిలించినట్లు గ్రామస్థులు పోలీసులకు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details