విశాఖ జిల్లా రావికమతంలో దొంగతనం జరిగింది. దాచేపల్లి లోవరాజు అనే వ్యాపారి ఇంట్లో 13 తులాల బంగారం, నాలుగు తులాల వెండిని దొంగలు అపహరించారు. దొంగిలించిన నగల విలువ రూ.13.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
విశాఖ మండల కేంద్రమైన రావికమతంలో బి-ఎన్ రహదారిని అనుకుని పవన్ ట్రేడర్స్ పేరుతో లోవరాజు దుకాణం నడుపుతూ... ఆ దుకాణం పైనే నివాసముంటున్నాడు. దుకాణం ఉన్న కింద పోర్షన్లో ఉన్న బీరువాలో బంగారం ఉంచారు. దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించి దొంగతనానికి. పోలీసులకు సమాచారం అందించటంతో... వారు అక్కడకు చేరుకుని క్లూస్ టీం ద్వారా వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.