విశాఖ జిల్లా అనకాపల్లిలో కార్పొరేట్ అభ్యర్థులుగా పోటీ చేయబోయే అభ్యర్థులు ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీలో పాల్గొనకూడదని ఎన్నికల నిబంధన ఉన్నప్పటికీ దీన్ని పాటించడం లేదని తెదేపా నాయకులు అరోపించారు. రేషన్ సరకుల పంపిణీలో వైకాపా నాయకులు పాల్గొంటున్నారని దీనిపై విచారణ జరపాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో తెదేపా నాయకులు మళ్ల సురేంద్ర, బొద్దపు ప్రసాద్, అర్రెపు కామేష్ తదితరులు ఉన్నారు.
వైకాపా నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెదేపా ఫిర్యాదు - ankapaally rdo office
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నాయకులు అనకాపల్లి ఆర్డీఓ, జీవీఎంసీ కార్యాలయల్లో అధికారులకు వినతి పత్రం అందజేశారు.
అధికారులకు వినతి పత్రం అందజేసిన తెదేపా నేతలు