విశాఖ జిల్లా చీడికాడ మండలం దండిసురవరం గ్రామ సమీపంలోని బొడ్డేరు నదిలో బొబ్బాది పరమేశ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లి కొట్టుకుపోయాడు. అప్పటినుంచి వెతకటం మొదలుపెట్టారు. ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందం ముమ్మరంగా గాలిస్తున్నా.. ఆచూకీ కానరాలేదు. ఐదు రోజులుగా కుటుంబ సభ్యులు యువకుడి కోసం ఎదురు చూస్తున్నారు.
నదిలో యువకుడు గల్లంతు..కానరాని ఆచూకీ - bodderu river latest news
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వాన వరద బీభత్సం సృష్టిస్తోంది. వాగులూ, వంకలూ, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. విశాఖ జిల్లా దండిసురవరం సమీపంలోని బొడ్డేరు నదిలో గల్లంతైన యువకుడి ఆచూకీ దొరకలేదు.
యువకుడి కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం