విశాఖ గాజువాకలో సెల్‌ఫోన్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. పెద గంట్యాడ మండలం పెద నడుపూరులో కన్నయ్య అనే యువకుడు నూతి దగ్గర నిలబడి సెల్ ఫోన్ మాట్లాడుతుండగా అది చేయిజారి నూతిలో పడిపోయింది. దాన్ని పట్టుకోబోయే క్రమంలో ప్రమాదవశాత్తు కన్నయ్య నూతిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన కన్నయ్య నెల రోజుల క్రితం పొట్టకూటి కోసం విశాఖకు వచ్చి.. ఇక్కడ టైలర్‌గా పనికి చేరాడని స్థానికులు చెబుతున్నారు. నూతి నుంచి కన్నయ్య మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు.
సెల్‌ఫోన్ పట్టుకోబోయి.. ప్రాణాలు విడిచిన యువకుడు - cell phone killing the man latest news update
పొట్టకూటి కోసం విశాఖకు వచ్చిన ప్రకాశం జిల్లా వాసి సెల్‌ఫోన్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. గాజువాకలో టైలర్‌గా పనికి చేరిన కన్నయ్య సెల్‌ఫోన్ మాట్లాడుతు బావి దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఫోన్ బావిలో పడిపోతుండగా పట్టుకోబోయి ప్రమాదవశాత్తు తను బావిలో పడి ప్రాణాలు విడిచాడు.
సెల్‌ఫోన్ పట్టుకోబోయి బావిలో పడిన యువకుడు