విశాఖ జిల్లా కశింకోట పోలీస్ స్టేషన్ సమీపంలో ఆళ్ల దిలీప్ కుమార్ అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక వైకాపా నాయకుడు మళ్ళ బుల్లిబాబు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు. యువకుడికి న్యాయం చేస్తానని అనకాపల్లి గ్రామీణ సీఐ నరసింహారావు హామీ ఇవ్వడంతో టవర్ నుంచి యువకుడు దిగాడు.
సెల్ టవర్ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం
విశాఖ జిల్లా కశింకోట పోలీస్ స్టేషన్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్ధానిక వైకాపా నాయకుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు.
వారం రోజుల కిందట వైకాపా నాయకుడు బుల్లిబాబుపై దాడి చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిలీప్ కుమార్ తో పాటు మరో యువకుడిపై కేసు నమోదు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా స్టేషన్ బెయిల్ తీసుకొవాలని చెప్పటంతో శాల్వెస్ కోసం తహసీల్దార్ వద్దకు వెళ్లగా... తనని తరచూ కార్యాలయం చుట్టూ తిప్పిస్తున్నారని దీలిప్ వాపోయాడు. బుల్లిబాబు చెప్పటం వల్లనే అధికారులు తనను తిప్పుతున్నారని దిలీప్ కుమార్ ఆరోపించారు. తనపై అన్యాయంగా కేసు బనాయించారని... దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలని కోరాడు.
ఇది చదవండితెలంగాణలో రికార్డు స్థాయిలో 872 కరోనా కేసులు