విశాఖ జిల్లాలోని సింహాచలం దేవస్థానం అవకతవకలపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్, ధార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈరోజు ఉదయం సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సూర్యకళకు వినతిపత్రం అందజేశారు. లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి పూడిపెద్ది శర్మ హెచ్చరించారు.
' సింహాచలం దేవస్థాన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి'
సింహాచలం దేవస్థానం అవకతవకలపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని దేవస్థానం కార్యనిర్వహణ అధికారికి విశ్వహిందూ పరిషత్, ధార్మిక సంఘాలు వినతిపత్రం అందించాయి. లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
ప్రధాన ఆలయంలో ఉన్న ఆండాళమ్మ వారి బంగారు వడ్డాణంపై జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ జరిపించి.. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రతి మూడు సంవత్సరాలకు బంగారు ఆభరణాలు తనిఖీలను నిర్వహించవలసి ఉంది. కానీ ఇప్పటివరకు ఎందుకు నిర్వహించలేదని ఈవోను ప్రశ్నించారు. ప్రతి నెల కిందిస్థాయి సిబ్బందికి జీతాలు చెల్లించలేని దేవస్థానం పీఆర్వో, ఫోటోగ్రాఫర్కు సంవత్సరానికి రూ.10 లక్షలు ఏ విధంగా చెల్లిస్తున్నారో సమాధానం చెప్పాలని విశ్వహిందూ పరిషత్, ధార్మిక సంఘాలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి