విశాఖ రైల్వే.. సరకు రవాణా చరిత్రలో మరో మైలురాయిని చేరుకుంది. రాజస్దాన్ జైపూర్ లోని కనక్ పుర నుంచి 120 టాటా ఏస్ వాహనాలతో కూడిన రైలు విశాఖ చేరింది. వీటిని రాష్ట్ర పౌరసరఫరాల సంస్ధ కోసం కొనుగోలు చేశారు. ఇటీవలే మర్రిపాలెం గూడ్స్ షెడ్ ను పూర్తిగా ఆధునీకరించి అనంతరం ఆటోమొబైల్ కార్గో రవాణా చేసే సామర్ధ్యాన్ని వాల్తేర్ డివిజన్ సాధించింది. దీనివల్ల గూడ్స్ రవాణా మరింత ఆదాయం ఆర్జించేందుకు వాల్తేర్ డివిజన్ కి వెసులుబాటు ఏర్పడింది.
30 బిఎఫ్ఆర్ వేగన్లతో కూడిన గూడ్స్ రైలు తయారీ ఫాక్టరీ నుంచి విశాఖకు చేర్చారు. వాల్తేర్ డివిజన్ లో ఏర్పాటు చేసిన వ్యాపార అభివృద్ది విభాగం కొత్త కార్గోను అన్వేషించి.. రైల్వే ద్వారా దానిని అమలు చేయటంలో విజయవంతమైనట్లు డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ హర్షం వ్యక్తం చేశారు. నవంబర్ నెలలో సగటును 55.6 రేక్ లను లోడ్ చేస్తే, డిసెంబర్ లో సగటున 60.77 రేక్ లకు చేరింది. ప్రస్తుతం ఒక్కరోజులోనే 75 రేక్ లను లోడ్ చేసిన రికార్డు వాల్తేరు డివిజన్ సొంతం చేసుకుంది.