నాటుసారా తయారీతో ఆ గ్రామంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు నాటు సారా బట్టీలను ధ్వంసం చేశారు. విశాఖ జిల్లా కశింకోట మండలం జమ్మాదులపాలెం శివారులో నాటుసారా తయారీ చేస్తున్న స్థావరాన్ని గుర్తించి… గ్రామ సర్పంచ్ కరక రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామస్తులు, మహిళలు కలిసి సుమారు 100 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. బెల్లం పులుపు డబ్బాలను తొలగించారు.
గ్రామస్థుల దాడిలో...100లీటర్ల నాటుసారా ధ్వంసం - kasimkota news
సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్థులు నాటుసారా స్థావరాలపై దాడి చేసి....100లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. ఈ ఘటన విశాఖ జిల్లా కశింకోట మండలంలో జరిగింది.
![గ్రామస్థుల దాడిలో...100లీటర్ల నాటుసారా ధ్వంసం నాటుసారా బట్టీలు ధ్వంసం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:32:20:1620021740-ap-vsp-46-03-sara-battila-dwamsam-av-ap10077-kbhanojirao-8008574722-03052021110451-0305f-1620020091-148.jpg)
నాటుసారా బట్టీలు ధ్వంసం