అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. విశాఖ జిల్లాలో నిన్న కురిసిన వర్షాలకు రావికమతం, రోలుగుంట మండలాల్లోని పక్వానికి వచ్చిన వరి పొలాలు, ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. రెండు మండలాల్లో కలిపి సుమారు 50 ఎకరాలకు పైగానే పంట నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. రావికమతం మండలంలోని కొండవాగు పొలాల మీదుగా ప్రవహించటంతో.... పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
అకాల వర్షాలు... రైతులకు తీవ్ర నష్టాలు - rains have caused the hardship of the Kharif farmers in vishakha
అకాల వర్షాలు ఖరీఫ్ రైతుల కష్టాన్ని నష్టాల పాలు చేశాయి. పక్వానికి వచ్చిన వరి పొలాలు ముంపునకు గురై... కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను నిండా ముంచాయి.
అకాల వర్షాలు... రైతులకు తీవ్ర నష్టాలు