విశాఖపట్నం జిల్లా చోడవరంలో మూడు కోట్ల రూపాయలతో ప్రారంభించిన రైతుబజార్ నిర్మాణ పనులు ఆసంపూర్తిగా నిలిచిపోయాయి. తాజాగా.. మార్కెటింగ్ శాఖ తమ పరిధిలో ఉన్న మార్కెట్ యార్డుల్లో కూరగాయలు, పండ్లు అమ్మకాలు జరిపేలా ఉత్తర్వులు జారీచేసింది.
చోడవరం రైతుబజార్లో ఉద్రిక్తత - చోడవరంలో వ్యాపారుల ఆందోళన
మార్కెట్ యార్డులను రైతు బజార్లుగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖపట్నం జిల్లా చోడవరం రైతు బజార్‌ను తరిలించే తరలించే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
![చోడవరం రైతుబజార్లో ఉద్రిక్తత The tension in the Chodorum farmer's bazaar vizag district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7388637-875-7388637-1590724864731.jpg)
చోడవరం రైతుబజార్లో ఉద్రిక్తత
ఈ ఆదేశాల ప్రకారం రైతుబజార్‌ను ఖాళీ చేయిస్తున్న పోలీసులకు వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాము ఎక్కడికీ వెళ్లేది లేదంటూ.. ఈ రైతుబజార్లోనే విక్రయాలు జరుపుతామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.