ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉద్యోగ కల్పనలో ముఖ్యమంత్రి జగన్ ది అరుదైన రికార్డు' - the chief guest at a state-sponsored training program

దేశంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత, సిఎం జగన్ కే దక్కుతుందని మంత్రి ముత్తంశెట్టి అన్నారు. అత్యంత పారదర్శకంగా, అవకతవకలు లేకుండా ఉద్యోగాలను ఇస్తున్నామని తెలిపారు.

The state tourism minister mottamshetti srinivas in vishaka lates

By

Published : Sep 20, 2019, 3:47 PM IST

Updated : Sep 20, 2019, 5:07 PM IST

3నెలల్లో నాలుగు లక్షలఉద్యోగాలు కల్పించారు..మొత్తం శెట్టి శ్రీనివాస్

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు నెలల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలుచ్చిన ఘనత ఒక్క సీఎం జగన్ కే దక్కిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు.దేశలో ఉన్న ముఖ్యమంత్రుల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారని తెలిపారు.మద్యం దుకాణాల సూపర్ వైజర్లు,సేల్స్ మెన్ లకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.మద్యం దుకాణాల ఉద్యోగాలకు,వాలంటీర్ల ఉద్యోగాలకు,గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా అత్యంత పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు.మద్యం దుకాణాలకు ఎంపికైన సూపర్ వైజర్లు,సేల్స్ మెన్ లకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు.ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులంతా నిజాయితీగా క్రమశిక్షణతో పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు.

Last Updated : Sep 20, 2019, 5:07 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details