ఓ సర్పాన్ని, మరో సర్పం మింగిన అరుదైన ఘటన బుధవారం అర్ధరాత్రి విశాఖపట్నం జిల్లాలో జరిగింది. నేవీ ఉద్యోగులు విధులు ముగించుకుని డాల్ఫిన్ హాల్‌కు వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కనే సర్పాన్ని మరో సర్పం మింగుతున్న దృశ్యాన్ని గమనించారు. సగం వరకు మింగిన తర్వాత వదిలేసింది. కానీ అప్పటికే ఆ సర్పం చనిపోయింది. సాధారణంగా ఒక జాతికి చెందిన జంతువు, అదే జాతి జంతువును తినడాన్ని కానిబాలిజం అని పిలుస్తారు.
VIRAL VIDEO: మింగలేక కక్కింది.. పామును మింగిన పాము! - snake was swallowed by another snake in visakha district
కప్పని పాము మింగడం సహజం. పామును, మరో పాము మింగడం చాలా అరుదు. అతి కష్టంగా మింగాలని ప్రయత్నించి సాధ్యపడక కక్కింది. ఇలాంటి అరుదైన ఘటనే విశాఖపట్నం జిల్లాలో జరిగింది.
పామును మింగిన పాము
వెంటనే పాములు పట్టే నేర్పరి నాగరాజుకి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు చేరుకుని చనిపోయిన, బతికి ఉన్న సర్పాలను తీసుకెళ్లి.. జనసంచారం లేని ప్రదేశంలో వదిలేశారు. ఈ దృశ్యాలను అక్కడున్న వారు తమ చరవాణిలో బంధించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: