ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన రైల్వేశాఖ - vishakhapatbnam

కరోనా వైరస్​ నియంత్రణలో భాగంగా రైల్వే బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే కార్యాలయాలకు వచ్చే వారికి తప్పని సరిగా ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్​తో పరీక్షించాలని నిర్ణయించింది. ఉద్యోగులను వారి శరీర ఉష్ణోగ్రత ఆధారంగా లోపలికి అనుమతించాలని బోర్డు పరిధిలోని అన్ని రైల్వే జోన్ల జనరల్ మేనేజర్​లను రైల్వే బోర్డు ఆదేశించింది.

The railway line, which is an alarming sight in terms of corona intensity
కరోనా తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన రైల్వేశాఖ

By

Published : Mar 19, 2020, 7:21 AM IST

కరోనా తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన రైల్వేశాఖ

రైల్వే బోర్డు ఆదేశాల మేరకు తూర్పుకోస్తా రైల్వే జోన్​లోని వాల్తేరు డివిజన్ అధికారులు కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు. విశాఖపట్నంలోని డీఆర్​ఎం కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు అత్యాధునిక పరికరాలతో స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచి చేతులు కడుక్కునే విధానంపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు.

లక్షకు పైగా రిజర్వేషన్ టిక్కెట్ల రద్దు

కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ప్రయాణాలు అంటేనే భయపడుతున్నారు. ఫలితంగా చాలా రైళ్లు దాదాపు ఖాళీగా తిరగాల్సి వస్తోంది. గడిచిన ఆరు రోజులలో సుమారు లక్షకు పైగా రిజర్వేషన్ టిక్కెట్లు రద్దయ్యాయని తూర్పు కోస్తా రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

టిక్కెట్లు రద్దు వల్ల పలు ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా నిలిపి వేశారు. విశాఖ మీదుగా నడుస్తున్న 10 రైళ్లను నిలిపివేయడంతో పాటు పరిస్థితిని బట్టి మరి కొన్నింటిని రద్దు చేస్తామని తూర్పుకోస్తా రైల్వే జోన్ అధికారులు చెబుతున్నారు. ఏసీ కోచ్​లలో దుప్పట్లు, కర్టెన్లను తొలగించారు. విశాఖ నుంచి బయల్దేరే ప్రతి రైలులో క్రిమిసంహారక మందులను చల్లిస్తున్నారు.

ఇదీచదవండి.

కృష్ణావాసికి కరోనా కష్టం...పెళ్లి వాయిదాకి పోలీసుల నోటీసులు

ABOUT THE AUTHOR

...view details